Hosts » Varadiah Profile
 
 
Program On Program Name Listen
Jun 14 2016 Geethamrutham
Jun 07 2016 Geethamrutham
May 31 2016 Geethamrutham
» More Archives...

Host: తిరువాయిపాటి వరదయ్య

TORi Show(s): గీతామృతం 
Zodiac: CAPRICORN
Occupation: రిటైర్డ్ తెలుగు పండితులు 
Location: IRVINE, CA
Education: తెలుగు విద్వాన్
Talents: ఆట వెలది, తేట గీతి పద్య రచన
Passion: గీతా పారాయణం
Likes/turn-ons: సుభాషితాలు 
Dislikes/turn-offs: పరుల నింద 
Favorite quotes: దేశ భాషలందు తెలుగు లెస్స
Favorite books/authors: భగవద్గీత, పోతనామాత్యుడు 
About me:
పుట్టిన ప్రదేశం: మద్దుల చెర్వుగ్రామం, వాయల్పాడు తాలూకా, చిత్తూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
తల్లి: పరవస్తు లక్ష్మీనరసమ్మ, తండ్రి:తిరువాయిపాటి లక్ష్మయ్య[పౌరోహితులు,రైతు, లక్ష్మీనృసింహుని అర్చకులు]
సహధర్మచారిణి : కస్తూరమ్మ
కుటుంబం: ఇద్దరు కుమారులు [రవి, కృష్ణ] మరియు ఒక అమ్మాయి [గీత]
విద్యార్హత: విద్వాన్,బి.ఏ.
వృత్తి: తెలుగు పండితుడు.[౩౩ సం.లు.] చిత్తూరు జిల్లా లోని పలు విద్యాలయాల్లో.
ప్రవృత్తి: సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణము[కన్వీనరు], పేద విద్యార్ధుల చదివించుట, వారికిఉచిత భోజన వసతి కల్పించుట, విహార యాత్రానిర్వహణము, అష్టావధానాలు నిర్వహించుట, జనరల్ నాలెడ్జి పరీక్షల నిర్వహించుట, నాటకాలు,ప్రతిభాపాటవ పోటీల నిర్వహణ, విద్యార్థుల సందేహ నివృత్తి కొనసాగిస్తూ వారి చిత్త వృత్తికి తగినట్లు వారి భవిష్యత్తుకు మార్గ నిర్దేశంచేయుట
గురువర్యులు:శ్రీమాన్ చేబ్రోలు గారు, TVKN సుదర్శనాచార్యులు, నాగసిద్ధారెడ్డి గారు, గౌరీ పెద్ది రామసుబ్బ శర్మగారు, కృష్ణమ నాయుడుగారు
ఆత్మీయులు: సుఖవాసిమల్లికార్జునరాయశర్మ, శ్రీమాన్ నరాల రామారెడ్డి, అక్కిరాజు సుందర రామకృష్ణ, వెంకయ్య సూరి, ఆముదాల మురళి మున్నగువారు.
ముఖ్య ప్రవృత్తి: అవకాశం దొరికినపుడల్లా పద్యరచన కుపక్రమించడం. హితులు, సన్నిహితులు, అధికారులను ప్రశంసిస్తూ పద్యాలురచించి వారిని సంతోషపెట్టుటలో ఆత్మానందం పొందడం.
అనువాదం: భగవద్గీతను తెలుగు పద్యాల్లో వ్రాయాలి అన్న సంకల్పం అమెరికాలో చిన్మయా మిషన్ ఇర్వైన్ నగరం కాలిఫోర్నియాలో కలిగింది. ఆలస్యం చేయక శక్తికి మించిన కార్యమయినా భగవాన్ శ్రీకృష్ణపరమాత్ముని ఆదేశానుసారం తెలుగులో ఆటవెలది పద్యంలో వ్రాయగలిగితిని. 
à°’à°• చిన్న విన్నపం. 
తే.à°—à±€|| రచయితను గాను కావ్యముల్ వ్రాయలేదు 
గురుల కరుణను విన్నంత గురుతుకల్గి 
పలుకుచుంటిని గీతను పరమ గురులు 

Omega Constellation Replica

తప్పు లెంచక మన్నింప దగును నన్ను.  
 
అభీష్టం: తెలుగు పది కాలాల పాటు అందరి మన్ననలు పొందుతూ నిత్య నూతనంగా విలసిల్లాలి!  à°°à°¾à°¬à±‹à°¯à±‡ తరాలవారికి కరదీపికలా వెలుగులు విరజిమ్మాలి!
 
సర్వేజనాస్సుఖినో భవంతు.

rolex replica